మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 26, 2020 , 00:30:44

హెచ్‌సీయూలో నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

హెచ్‌సీయూలో నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

కొండాపూర్‌: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌ విభాగానికి అనుబంధంగా నిర్మించిన నూతన భవనాన్ని మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రమేశ్‌పొఖ్రియాల్‌ మాట్లాడుతూ దేశంలో అంతర్జాతీయ విద్యావిధానాలను ప్రధాని ప్రారంభించడం విద్యా విధానంలోనే సరికొత్త శకం అన్నారు. ఆత్మనిర్భర్‌, నూతన విద్యా విధానాలు దేశంలో సరికొత్త మార్పును తీసుకువస్తాయన్నారు. జ్ఞాన్‌, విజ్ఞాన్‌, అనుసంధాన్‌ల ప్రాముఖ్యతను వివరించారు. వర్చువల్‌ విధానంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్సిటీ వీసీ పీ.అప్పారావు ఆహ్వానం పలికి, వర్సిటీ యొక్క విశిష్టతలను వివరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్‌ ధోత్ర, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు.