మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Oct 29, 2020 , 06:48:43

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

పూడూరు : గుర్తుతెలియని ఓ వివాహిత మహిళ (30) దారుణ హత్యకు గురైన ఘటన చన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌-బీజాపూరు హైవే రోడ్డు రాకంచర్ల ఇండస్ట్రియల్‌ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ  గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. హత్య చేసిన మహిళను హైవే రోడ్డు కల్వర్టు దగ్గర ఉన్న నీటి కుంటలో వేసి వెళ్లారు. మృతురాలి వద్ద ఎలాంటి అడ్రస్‌ లేదని, ఒంటిపై  ఆరంజ్‌ కలర్‌ స్కర్ట్‌, బ్లాక్‌ కలర్‌ టాప్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. జరిగిన ఘటన తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ లక్ష్మీరెడ్డి సందర్శించి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.