సోమవారం 03 ఆగస్టు 2020
Rangareddy - Jul 08, 2020 , 00:22:36

టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి

టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి

కందుకూరు:  మండలంలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. మండల పరిధిలోని జైత్వారం గ్రామానికి చెందిన బైరు జగన్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ మండల కన్వీనర్‌గా నియమితులైన సందర్భంగా మంగళవారం ఆయన మంత్రి సబితాఇంద్రారెడ్డిని  కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బైరు రాంరెడ్డి, నోబుల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బైరు కొండల్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మన్నే జయేందర్‌ ముదిరాజ్‌, సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, సురుసాని శేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సదానంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo