గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 23:44:29

అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

 అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

  దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎస్‌వీ.కృష్ణారెడ్డి(54) అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కృష్ణారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పార్థీవదేహానికి ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణారెడ్డి 2001లో గ్రామసర్పంచ్‌గా టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికై సేవలు అందించారు.