సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 09, 2020 , 23:57:22

బడంగ్‌పేటలో ట్రీ పార్కు..

బడంగ్‌పేటలో ట్రీ పార్కు..

లక్షలతో నర్సరీల ఏర్పాటు కార్పొరేషన్‌కు అవసరమైన 

మొక్కలను  పెంచడానికి సన్నాహాలు 

ఎకరాల్లో నర్సరీలు 

బడంగ్‌పేట, గుర్రంగూడలో ఏర్పాటు 

బడంగ్‌పేట, ఆగస్టు 9: బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.90 లక్షలతో నర్సరీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని దావుత్‌ఖాన్‌ గూడ, అల్మాస్‌గూడ, గుర్రంగూడ టీచర్‌కాలనీలో ఎకర స్థలం చొప్పున కేటాయించి నర్సరీలను ఏర్పాటు చేయడానికి స్థలం చదును చేశారు. షెడ్లు వేస్తున్నారు. మూడు లక్షల మొక్కలను పెంచడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. బడంగ్‌పేట దావత్‌ఖాన్‌ గూడలో ఏర్పాటు చేస్తున్న నర్సరీని రూ.30లక్షలతో అభివృద్ధి చేస్తున్నారు. దీంట్లో 25 లక్షల రూపాయలు  మొక్కలు పెంచేందుకు, రూ. 5 లక్షలతో స్థలం చుట్టూ ఫెన్సింగ్‌, షెడ్డు వేయడానికి పనులు చేయిస్తున్నారు. ప్రసుత్తం బడంగ్‌పేటలో మూడు చోట్ల నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నర్సరీలో లక్ష మొక్కలు పెంచడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటి నుంచి మొక్కలు పెంచితే వచ్చే ఏడాదికి ఆరుఫీట్ల వరకు పెరుగుతాయని పేర్కొంటున్నారు.  అవసరమైన మొక్కలను వేరే ప్రాం తాల నుంచి తీసుకురావడం తప్పుతుందని పేర్కొన్నారు. అంతేగాకుండా ఒక్క మొక్కను కొనుగోలు చేయడానికి  ఒక్క రూపాయి 30 పైసలు ఖర్చు అవుతుందన్నారు. రవాణా ఖర్చు సైతం తప్పుతుందనే ఉద్దేశంతో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొంటున్నారు. విద్యాశాఖ మంత్రి  పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనుకున్న మొక్కలను పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది హరితహారం కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

నర్సరీల ఏర్పాటుకు నిధులు

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.90 లక్షలతో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నర్సరీలను పెంచడానికి మూడు ఎకరాల స్థలం తీసుకున్నాం. మూడు లక్షల మొక్కలను పెంచడానికి అవకాశం ఉంటుంది. మొక్కల కొనుగోలు కంటే నర్సరీలను ఏర్పాటు చేయడమే ఉత్తమం. నర్సరీల ద్వారా తక్కువ ఖర్చు అవుతుంది. అనుకున్న మొక్కలను పెంచడానికి వీలుంటుంది. ప్రసుత్తం నర్సరీలను ఏ ర్పా టు చేయడానికి పనులు కొనసాగుతున్నాయి. 

- డీఈ అశోక్‌రెడ్డి 

వేగంగా సాగుతున్న పనులు 

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ట్రీ పార్కును ఏర్పాటు చేయనున్నాం. 10 వేల మొక్కలను యాదాద్రి నమూనాలో నాటుతాం. అందుకు సంబంధించిన పనులు చే యిస్తున్నాం. బడంగ్‌పేటలో ఇప్పటికే 80వేల మొక్కల ను నాటాం. ఒకే చోట పదివేల మొక్కలను నాటనున్నాం. మూడు నర్సరీల్లో మూడు లక్షల మొక్కలను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎక్కువ ఆక్సిజన్‌ ఇచ్చే మొక్కలను పెంచాలని నిర్ణయించాం. నర్సరీల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 

- కృష్ణ మోహన్‌రెడ్డి, కమిషనర్‌