ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 15, 2020 , 00:31:11

నూతన రెవెన్యూ చట్టంతో పారదర్శకత

 నూతన రెవెన్యూ చట్టంతో పారదర్శకత

ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

ఉప్పల్‌ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపడంలో సీఎం కేసీఆర్‌ విశేషంగా కృషిచేస్తున్నారని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టంతో పారదర్శకత ఉంటుందని తెలిపారు. నేడు యావత్తు తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉప్పల్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్‌ అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించామని, సమగ్రాభివృద్ధికోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఉప్పల్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌, లింకురోడ్లు, వాటర్‌ రిజర్వాయర్లు, బస్తీ దవాఖానలు, పార్కులు, థీమ్‌పార్కులు, జంక్షన్ల అభివృద్ధితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈశాన్య ప్రాంతమైన ఉప్పల్‌లో దీర్ఘకాలిక సమస్యలైన ఉప్పల్‌ భగాయత్‌, ఉప్పల్‌ ప్రధాన రహదారి సమస్యలతోపాటు, నీటి సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టామన్నారు. శిల్పారామం, వరదనీటికాలువల నిర్మాణం, బస్తీదవాఖానలు, మల్టీలెవల్‌ ఫంక్షన్‌హాల్‌, మోడల్‌ మార్కెట్లు నిర్మించి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఐటీ అభివృద్ధిలో భాగంగా 5 కంపెనీలకు పత్రాలను మంత్రి కేటీఆర్‌ జారీ చేశారని తెలిపారు. ఐటీలో ఉప్పల్‌ మేటిగా నిలిచేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో లేతాకుల రఘుపతిరెడ్డి, తవిడబోయిన గిరిబాబు, ఆకుల మహేందర్‌, చింతల నర్సింహారెడ్డి, ఐలేశ్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు. 

వీల్‌చైర్‌ అందజేసిన ఎమ్మెల్యే 

టీఆర్‌ఎస్‌  డివిజన్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం చిలుకానగర్‌ డివిజన్‌కు చెందిన ఆయాన్‌కు వీల్‌చైర్‌ను అందజేశారు. దివ్యాంగులకు అండగా ఉంటూ వారికి తగిన తోడ్పాటు అందించాలన్నారు.  కొకొండ జగన్‌, గరిక సుధాకర్‌, నాగిళ్ల బాల్‌రెడ్డి, వినీశ్‌, శివ పాల్గొన్నారు. 

ప్రెస్‌క్లబ్‌కు టేబుళ్ల అందజేత 

టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు  లేతాకుల రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో  ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చేతుల మీదుగా ప్రెస్‌క్లబ్‌కు టేబుళ్లను అందజేశారు. కార్యక్రమంలో జితేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, ఐలేశ్‌ పాల్గొన్నారు.