మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 00:05:27

తుక్కుగూడ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

తుక్కుగూడ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

తుక్కుగూడ:  తుక్కుగూడ సమీపంలోని  పెద్ద చెరువును  పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. పెద్ద చెరువును మంగళవారం మంత్రి  పరిశీలించారు. దాదాపు 60 ఎకరాల చెరువు భూముల్లో 10 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనా ఎందుకు పట్టించుకోవడం లేదని  డీఈ , ఏఈ లపై మండిపడ్డారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులోనే చెత్త వేయడంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకర్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీవెంకట్‌ రెడ్డి, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.