మంగళవారం 04 ఆగస్టు 2020
Rangareddy - Jul 05, 2020 , 23:32:01

పనులు వేగవంతంగా చేయాలి

పనులు వేగవంతంగా చేయాలి

మహేశ్వరం: మండలంలోని అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.  మండలంలోని అధికారులు, సర్పంచ్‌లతో ఆదివారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏ ర్పాటు చేసి, పొలాల వద్ద కల్లాలను నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 కిలోల  రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  డీఎల్‌పీవో శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీడీవో నర్సింహులు, తహసీల్దార్‌ ఆర్‌పీ జ్యోతి, ఏఈ హన్మంత్‌రెడ్డి, సతీశ్‌, అనిల్‌ పాల్గొన్నారు.


logo