గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 23:32:17

ఏండ్ల సమస్యకు పరిష్కారం

ఏండ్ల సమస్యకు పరిష్కారం

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగస్టు 28: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఎక్కడా అభివృద్ధి పనులు ఆగకుండా చూస్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని నలగండ్ల ఫ్లైఓవర్‌ కింద నూతనంగా నిర్మించిన వీడీసీసీ రోడ్డును జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా నెలకొన్న సమస్య నేటితో తీరిందన్నారు.  కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్‌, ఏఈ కృష్ణవేణి, శేరిలింగంపల్లి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్‌, నాయకులు పద్మారావు, సత్యనారాయణ  పాల్గొన్నారు. 

నలగండ్ల హుడా కాలనీలో ఎమ్మెల్యే గాంధీ పర్యటన

గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని నలగండ్ల హుడా కాలనీలో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నలగండ్ల రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద రోడ్డు నిర్మాణ సమయంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.