శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 23:09:22

ఇంజినీరింగ్‌ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి

ఇంజినీరింగ్‌ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి

బండ్లగూడ/చందానగర్‌:  ఇంజినీరింగ్‌ కళాశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంజినీరింగ్‌ కాలేజీల ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా అసోసియేషన్‌  అధ్యక్షుడు  రవీందర్‌ మాట్లాడుతూ కళాశాలల ఫీజు రాయితీని వెంటనే చెల్లించాలన్నారు. వేతనాలు రాక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.  వినతిపత్రం ఇచ్చిన వారిలో ప్రొఫెసర్‌ రమేశ్‌, దినేశ్‌యాదవ్‌, రవి ఉన్నారు.