మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 07, 2020 , 01:47:20

నాటిన మొక్కను బాధ్యతగా కాపాడాలి

నాటిన మొక్కను బాధ్యతగా కాపాడాలి

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

శామీర్‌పేట : హరిత హారంలో నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా మండల కేంద్రం శామీర్‌పేటలోని జ్యుడిషియల్‌ అకాడమీలో ఆదివారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 6 విడుతలుగా చేపడుతున్న హరితహారంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, అటవీశాఖ కార్యదర్శి శాంతికుమారి, ఐఎఫ్‌ఎస్‌.శోభ, అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ సురేందర్‌, ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నారు.