ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 05, 2020 , 01:16:04

కొత్త ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను అమలుచేయాలి

కొత్త ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను అమలుచేయాలి

 మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 

షాబాద్‌: చేవెళ్ల నియోజకవర్గం 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నూతన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను అమలుచేయాలి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 111 జీవో పరిధిలో నూతనంగా వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను వర్తింపజేయాలని కోరినట్లు తెలిపారు. లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జీవో పరిధిలోని గ్రామాలకు ఎల్‌ఆర్‌ఎస్‌లో అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.