శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 01:03:23

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి

తుక్కుగూడ : మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌  వెంకట్‌రెడ్డి  శనివారం మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. చెరువుకు సంబంధించిన ఆరు ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారన్నారు. మరోభాగం సర్వే చేయాల్సి ఉందన్నారు.  నూతన మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ పార్కు, అర్బన్‌ పార్కు, క్రీడామైదానం, వైకుంఠధామం, ఆడిటోరియం ఏర్పాటుకు  స్థలాలు కేటాయించాలని కోరారు. కౌన్సిలర్లు సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్‌, రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేస్తా..

కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అగర్‌మియాగూడ సర్పంచ్‌ ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ రేవంత్‌రెడ్డి శనివారం ఆమెను కలిసి లేమూరు నుంచి అగర్‌మియాగూడ వరకు ఉన్న రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ రోడ్లు  అభివృద్ధి చెందాయని తెలిపారు. అగర్‌మియగూడ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు లిక్కి జంగారెడ్డి, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌, పాండు, యాదగిరి, పెద్దయ్య, ప్రత్యేక అధికారి రాజబాబు పాల్గొన్నారు.