గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 09, 2020 , 00:22:35

ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం

ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం

హరిపురికాలనీలో వరదనీటి కాలువ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఆర్కేపురం : హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆర్కేపురం డివిజన్‌ హరిపురికాలనీ రోడ్డు నం.3లో రూ.43 లక్షల వ్యయంతో వరద నీటి కాలువ పైపులైన్ల పనులకు స్థానిక కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీపై ప్రత్యేక దృష్టిపెట్టి.. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నాలాలు, ఫ్లైఓవర్స్‌, రోడ్లు,  తదితర అభివృద్ధి పనులు చేయిస్తున్నారని తెలిపారు.  వర్షం వచ్చిన సమయంలో వరదనీటితో హరిపురికాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంత్రి తక్షణమే స్పందించి.. వరదనీటి కాలువ పైపులైన్ల పనుల కోసం రూ.43లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. త్వరితగతిన వరదనీటి కాలువ పనులను పూర్తి చేసి.. స్థానికుల ఇబ్బందులు తొలగించాలని అధికారులను  ఆదేశించారు. కరోనా సమయంలో కూడా హైదరాబాద్‌లోని కాలనీ రోడ్లతో పాటు ప్రధాన రహదారులు కూడా నిర్మించారన్నారు. నగరంలో పార్కులు కబ్జాకు గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండి.. మన పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, ఆర్కేపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌, ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌ ముదిరాజ్‌,  హరిపురికాలనీ అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదిర్శ కృష్ణమూర్తి, కోశాధికారి అనిల్‌కుమార్‌, యాదగిరి, ప్రభాకర్‌, రఘు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజుశ్రీవాత్సవ, కె.శ్రీనివాస్‌, సిద్ధగోని వెంకటేశ్‌గౌడ్‌, ఎం.లింగస్వామిగౌడ్‌, వి.యాదవరెడ్డి, పి.భూపాల్‌రెడ్డి, శ్యాంగుప్తా, సాజీద్‌, పి.శ్రీనివాస్‌, బి.మల్లేశ్‌ముదిరాజ్‌, శ్రీమన్నారాయణ, రమేశ్‌గౌడ్‌, రాములుయాదవ్‌, మారం సుజాతారెడ్డి, ఉర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

 బడంగ్‌పేట: ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్‌కు చెందిన ప్రభాకర్‌కు  సీఎం రిలీఫ్‌ ఫండ్‌కింద మంజూరైన  రూ. 60 వేల చెక్కును బుధవారం మంత్రి అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారికి ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తామన్నారు.  ఈ సందర్భంగా ప్రభాకర్‌.. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు నిమ్మల నరేందర్‌ గౌడ్‌, జూలకంటి  సురేశ్‌ గౌడ్‌,  మురళీ, విజయ్‌ కుమార్‌, తదితరులు ఉన్నారు.