గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 22:47:10

కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట

కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి

చెరువుల్లో చేపలు వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  కందుకూరు, ఆగస్టు 28 : కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి మండల పరిధిలోని కొత్తగూడ, జైత్వారం, పులిమామిడిల్లోని చెరువుల్లో శనివారం  చేపలను వదిలారు. కొత్తగూడలో సర్పం చ్‌ సాధ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్‌ చెరువులు కుంటల్లో చేపలు వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మత్స్య, ముదిరాజ్‌ కులాలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రూ. 100 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 52 కోట్లతో 8 కోట్ల చేపపిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. చేపలను అమ్ముకోవడానికి వాహనాలు, ఉచితంగా వలలు పంపిణీ చేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సాధ మల్లారెడ్డి, ఎర్రబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, అనితా శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, బొక్క జ్యోతి నర్సింహారెడ్డి, సురేశ్‌, పార్టీ మండలాధ్యక్షుడు జయేందర్‌ముదిరాజ్‌, సామ ప్రకాశ్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, రాయిచెట్టు యాదయ్య, బొక్క దీక్షిత్‌రెడ్డి, కార్తీక్‌, వెంకటేశ్‌, లక్ష్మాణాచారి, మాదవాచారి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌గౌడ్‌, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో కృష్ణకుమారి, మేఘనాథ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సామయ్య పాల్గొన్నారు. 

అభివృద్ధిని అడ్డుకోవద్దు.. 

  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని,  ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి   తెలిపారు.   మండల పరిధిలోని కొత్తగూడలో  ఎకరం స్థలంలో 150 పండ్ల మొక్కలతో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్‌ కోర్టును జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులతో ఆటలాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల మరిన్ని అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారంతో పాటు, ఫ్లాటు,  కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సురుసాని వరలక్ష్మీసురేందరన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ గోపీరెడ్డి విజయేందర్‌రెడ్డి, సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జయేందర్‌ ముదిరాజ్‌, బొక్క దీక్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.