బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 09, 2020 , 00:57:11

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

మొయినాబాద్‌ : పేదల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అనారోగ్యానికి గురై ప్రైవేట్‌ దవాఖానలో ఫీజులు చెల్లించిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం రావడంతో 20 మంది లబ్ధ్దిదారులకు మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్‌తో కలిసి చెక్కులను పంపిణీ చేశాడు. అదే విధంగా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా వచ్చిన సబ్సిడీ రుణాల చెక్కులను కూడా పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేవపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి వ్యక్తికి ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. నిరుద్యోగ మైనార్టీ యువతను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 80 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు స్వరూప, శోభ, కుమార్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్‌, ఎంపీటీసీ రవీందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్‌, సుధాకర్‌యాదవ్‌, బాల్‌రాజ్‌, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కేశంపేట : మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి మంగళవారం ఎక్లాస్‌ఖాన్‌పేటలో సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని పాపిరెడ్డిగూడలో కృష్ణకు రూ.13వేలు, పుట్టోనిగూడెం కవితకు రూ.12వేలు, తొమ్మిదిరేకుల సురేశ్‌కు రూ.32వేలు, నిర్దవెళ్లి వెంకటమ్మకు 30వేలు, కాకునూరు లక్ష్మీదేవికి 30వేలు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పుట్టోనిగూడెం సర్పంచ్‌ జగన్‌నాయక్‌, నాయకులు పాల్గొన్నారు.