సోమవారం 06 జూలై 2020
Rangareddy - Jun 30, 2020 , 01:17:51

హరిత తెలంగాణే లక్ష్యం

హరిత తెలంగాణే లక్ష్యం

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి 

మొక్కలు నాటిన నాయకులు

బండ్లగూడ:  హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని  రాధానగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మేయర్‌ మహేందర్‌గౌడ్‌లతో కలిసి సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ  హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఖాళీ స్థలాలు, పార్కుల్లో మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మావతి పాపయ్యయాదవ్‌, ఆసియాబేగం, శ్రీలత సురేశ్‌గౌడ్‌, సాగర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి నాయకులు రాందాస్‌, వీరస్వామిగౌడ్‌, శ్రీ శైలం, మనోహర్‌ పాల్గొన్నారు.

బడంగ్‌పేట:  మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు.  కార్పొరేషన్‌ పరిధిలోని 9, 27 వార్డుల్లో కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్‌ గౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, ఇంద్రసేనా, భాగ్యనగర్‌ బ్యాంక్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, కమిషనర్‌ సత్యబాబుతో కలిసి సోమవారం ఆమె మొక్కలు నాటారు. కార్యక్రమంలో అందెల ఐలయ్య, అమరేందర్‌రెడ్డి, జగన్‌ ము దిరాజ్‌, ఏనుగు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మణికొండ:  మున్సిపల్‌ పరిధిలోని శివపురికాలనీలో ము న్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ   హరితహారంలో ప్రతి ఒక్కరూ భా గ స్వాములు కావాలన్నారు. కౌన్సిలర్లు లావణ్య, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, నాయకులు నరేశ్‌, కిరణ్‌ రవికాంత్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

మణికొండ మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో  టీఆర్‌ఎస్‌  మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జయంత్‌, ప్రధానోపాధ్యాయుడు నిరంజన్‌ , నాయకులు శ్రీరాములు, వసంత్‌, రాజిరెడ్డి, విజయ, శివగంగ తదితరులు పాల్గొన్నారు.

తుక్కుగూడ :  మున్సిపల్‌ పరిధిలోని రావిరాల  ఉన్నత పా ఠశాల ఆవరణలో మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటారు. మున్సిపల్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, హెచ్‌ఎం సుజాత, నాయకులు మా ణిక్యం,బాట సురేశ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. 


logo