గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 14, 2020 , 00:41:27

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి

మంత్రి  సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సాయిబాలాజీ టౌన్‌ షిప్‌ వాసులు

 బడంగ్‌పేట:  సాయి బాలాజీటౌన్‌ షిప్‌ కాలనీని బడంగ్‌పేట కార్పొరేషన్‌లో విలీనం చేసినందుకు మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు  మంత్రి  సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కన్జర్‌వేషన్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఉన్న స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించే విధంగా చొరవ తీసుకోవాలని ఏజీఆర్‌ కాలనీ వాసులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ సాయి బాలాజీటౌన్‌షిప్‌ సమస్యను అసెంబ్లీలో తాను లేకున్నా సీఎం కేసీఆర్‌ గుర్తు పెట్టుకొని ఆమోదం తెలిపే విధంగా చొరవ తీసుకున్నందుకు ఎప్పుడు మర్చి పోకూడదన్నారు. ముఖ్యమంత్రికి కాలనీ వాసులు ఎప్పుడు రుణపడి ఉండాలన్నారు. కార్పొరేటర్‌ ఏనుగు రాంరెడ్డి, భీమిడి స్వప్న జంగారెడ్డి, పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి, నాయకులు సంరెడ్డి వెంకట్‌రెడ్డి, ముత్యాల కృష్ణ, పెద్ద బావి సమర సింహారెడ్డి, చప్పిడి సంతోష్‌రెడ్డి, కుంచ నాగేందర్‌గౌడ్‌, తుఫాన్‌రెడ్డి, మల్గారి శ్రీపాల్‌రెడ్డి, మల్గారి ఉపేందర్‌రెడ్డి,  కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.