సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 17, 2020 , 01:36:30

ఆపదలో ఉన్న వారికి సీఎం ఆపన్న హస్తం

ఆపదలో ఉన్న వారికి సీఎం ఆపన్న హస్తం

బడంగ్‌పేట, సెప్టెంబర్‌16: ఆపదలో ఉన్న వారికి సీఎం కేసీఆర్‌ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 42వ డివిజన్‌లో నివాసం ఉంటున్న పల్లవి కిరణ్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రూ.60వేల చెక్కును మంత్రి అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా వేల మందికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి లబ్ధి చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి సబితారెడ్డికి, టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు బండి మీనా నాగేశ్‌కు పల్లవి కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామన్నారు.