శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 23:17:28

విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

మంత్రి సబితాఇంద్రారెడ్డి 

మహేశ్వరం: విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరంలో బాల, బాలికల పాఠశాలను రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి తనిఖీ చేసి హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ పాఠాలను విద్యార్థులు ఏ మేరకు అనుసరిస్తున్నారో ఉపాధ్యాయులు తెలుసుకోవాలన్నారు. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి.. ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని సూచించారు. సెల్‌ఫోన్లు, టీవీలు ఉన్న వారు, లేని వారి డేటాను సేకరించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 4 కోట్లతో నిర్మించనున్న   ప్రభుత్వ కమ్యూనిటీ కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మంచె పాండు, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్‌ ఇంద్రాసేనారెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, మహేశ్వరం ఉపసర్పంచ్‌ దోమ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.