మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 07, 2020 , 23:37:18

వన్‌ టైం సెటిల్మెంట్‌ సద్వినియోగం చేసుకోండి

వన్‌ టైం సెటిల్మెంట్‌ సద్వినియోగం చేసుకోండి

క్యాంపు కార్యాలయంలో జలమండలి

అధికారులతో అరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం 

చందానగర్‌ : ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లులను ఏకకాలంలో చెల్లించేలా వన్‌ టైం సెటిల్మెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లా బిల్లులు బకాయిలు ఉన్నవారు వన్‌ టైం సెటిల్మెంట్‌ స్కీం ద్వారా వడ్డీ లేకుండా బకాయి మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించి భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. బిల్లుల మొత్తాన్ని సెప్టెంబర్‌ 30, 2020 లోగా జలమండలి కార్యాలయంలో చెల్లించాలన్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయం చేసుకొని ఆయా డివిజన్‌లో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ సమస్యలను త్వరగా గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా పరిష్కరించాలన్నారు. కాలనీలు, బస్తీలో ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు , జలమండలి జనరల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, డీజీఎం నాగప్రియ పాల్గొన్నారు.