సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 04, 2020 , 00:41:17

ఆన్‌లైన్‌ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆన్‌లైన్‌ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలి

మహేశ్వరం: ఆన్‌లైన్‌ పాఠాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తుమ్ములూరు సర్పంచ్‌ మద్ది సురేఖ అన్నారు. గురువారం గ్రామంలో విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారా లేదా అని ఉపాధ్యాయులతో కలిసి తెలుసుకున్నారు. సర్పంచ్‌ మాట్లాడుతూ.. విద్యకు దూరం కాకూడదనే నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.