గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 26, 2020 , 00:13:58

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ని సద్వినియోగం చేసుకోండి

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ని సద్వినియోగం చేసుకోండి

మాదాపూర్‌/హైదర్‌నగర్‌, ఆగస్టు 25: ప్రభుత్వం ప్రకటించిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని బిల్లులను చెల్లించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన వన్‌ టైం సెటిల్మెంట్‌లో భాగంగా ప్రతిఒక్కరూ నీటి బిల్లులను సెప్టెంబర్‌ 30లోగా వాటర్‌ బోర్డులకు చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జలమండలి జీఎం రాజశేఖర్‌, డిజీఎం నాగప్రియ, మేనేజర్‌ సుబ్రహ్మణ్యం  పాల్గొన్నారు. 

సీఎం సహాయనిధి పేదలకు భరోసా..

సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కును విప్‌ గాంధీ మంగళవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు కార్పొరేట్‌ వైద్యం పొందేందుకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కాశీనాథ్‌యాదవ్‌ పాల్గొన్నారు.