గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 23:41:08

చిత్తడిగా అంతర్గత రోడ్లు..!

చిత్తడిగా అంతర్గత రోడ్లు..!

ఇబ్బందులు పడుతున్న స్థానికులు

అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు

కుత్బుల్లాపూర్‌ : గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి అంతర్గత రోడ్లన్నీ బురదమయంగా దర్శనమిస్తున్నాయి. కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్‌తో పాటు సుచిత్ర ప్రాంతాల్లో అంతర్గత రోడ్లన్నీ చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల డివిజన్‌లోని ఆయా ప్రాంతా ల్లో సీసీరోడ్ల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. కానీ తిరిగి నిర్మించడంలో గుత్తేదార్లు ఆలస్యం చేయడంతో గుంతలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధి బ్యాంక్‌ కాలనీలో డ్రైనేజీ పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే మార్గం గుండా ప్రైయివేట్‌ గ్యాస్‌పైపులైన్‌ ఉండడంతో పైపులైన్‌ను పూర్తిస్థాయిలో వేయకుండా వదిలేశారు. దీంతో వర్షపునీరు నిలిచి ఆ దారి చిత్తడిగా మారింది.