శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Oct 01, 2020 , 06:45:30

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు.. మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు.. మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

 వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు

 సహాయక శిబిరాల వద్ద ఆహారం, నిత్యావసర వస్తువుల అందజేత

బడంగ్‌పేట :  ఇటీవల కురిసిన వర్షాలతో మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సహయక చర్యలను ప్రారంభించారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నవయుగ కాలనీ, మదురా పురి, సాయి బాలాజీ టౌన్‌ షీప్‌, లక్ష్మినగర్‌, శాంతి నగర్‌, బాలాజీనగర్‌, మీపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సత్యసాయి నగర్‌, మిథీలానగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, ప్రశాంత్‌నగర్‌, మురళీ కృష్ణ నగర్‌, లెనిన్‌నగర్‌, వెంకటేశ్వర కాలనీ, శ్రీధర్‌ కాలనీలు 15 రోజుల నుంచి జలమయంలో చిక్కుకున్నాయి. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సహయక చర్యలు చేయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మంత్రి దగ్గర ఉండి చెరువుల తూములను క్లీన్‌ చేయడం, వరద నీరు సాఫీగా పోవడానికి వరద కాల్వలను తీయించడం, మ్యాన్‌ హోల్స్‌ క్లీన్‌ చేయడం వంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. 

బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, మీర్‌పేట కమిషనర్‌ సుమన్‌ రావు, బడంగ్‌పేట కమిషనర్‌ క్రిష్ణ మోహన్‌రెడ్డి తదితరులు ముంపు ప్రాం తాల్లో పర్యటించి సహయక చర్యలు చేపడుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారిచేశారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు.