శుక్రవారం 23 అక్టోబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 01:03:42

గ్రేటర్‌లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు

గ్రేటర్‌లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు

ఉప్పల్‌లో రూ.కోటితో శంకుస్థాపన...

హాజరైన మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి

ఉప్పల్‌: గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గ్రంథాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉప్పల్‌ బీరప్పగడ్డ ప్రాంతంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి సోమవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సీహెచ్‌. మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగు మీడియంలో ఆన్‌లైన్‌ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ఇంగ్లిష్‌ మీడియం తరగతులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సూచన మేరకే ఉప్పల్‌లో గ్రంథాలయ భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఉప్పల్‌లో డిగ్రీ, జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామన్నారు. గ్రంథాలయ భవన నిర్మాణాల కోసం మేడ్చల్‌ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించే విధంగా చూస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఉప్పల్‌లో గ్రంథాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బేతి అన్నారు. మరో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. మేడ్చల్‌ జిల్లాలో మరో 11 ప్రాంతాల్లో గ్రంథాలయ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని త్వరలోనే ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌, జిల్లా చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌, తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, కార్పొరేటర్లు సరస్వతీసదానంద్‌, హన్మంతరెడ్డి,  జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శివారెడ్డి, నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌, గిరిబాబు, జగదీశ్‌,  సంతోష్‌రెడ్డి, పాపిరెడ్డి, రవికుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.logo