మంగళవారం 20 అక్టోబర్ 2020
Rangareddy - Sep 24, 2020 , 01:13:05

ముంపు సమస్యను పరిష్కరిస్తా

ముంపు సమస్యను పరిష్కరిస్తా

   మంత్రి సబితాఇంద్రారెడ్డి

 పహాడీషరీఫ్‌ :  జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో కాలనీలు, బస్తీల్లో ముంపు సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని కొత్తపేటలో కుంటను, నబిల్‌ కాలనీ, అమ్రీన్‌కాలనీ, వాది యే ముస్తఫా, వాది హుదా కాలనీల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు.  ఎగువ నుంచి వస్తున్న వరదనీరు కాలనీల్లోకి చేరకుండా నేరుగా చెరువుల్లోకి  పోవడానికి ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్‌ జి.పి కుమార్‌, ఏఈ కిష్టయ్యను ఆదేశించారు. వాదియే ముస్తఫా కాలనీలో ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  కార్యక్రమంలో బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, జల్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్లా సాది, కౌన్సిలర్లు షేక్‌ పహిమిదా అఫ్జల్‌, బుడుమాల యాదగిరి, హైమద్‌ కసాది, శంషొద్దీన్‌,  సౌద్‌ అవాల్గీ, మజర్‌అలీ, కెంచె లక్ష్మీనారాయణ, నాయకులు ఇక్భాల్‌ బిన్‌ ఖలీఫా, యూసుఫ్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

  టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు.. 

 కందుకూరు:  టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట్‌కు చెందిన చిర్ర సాయిలును నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా ప్రకటిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్‌కమిటీ  చైర్‌పర్సన్‌ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు మన్నే జయేందర్‌ ముదిరాజ్‌, సర్పంచ్‌ జ్యోతి పాల్గొన్నారు.

 చెరువులను అభివృద్ధి చేస్తాం.. 

  బడంగ్‌పేట : బాలాపూర్‌ మండలంలోని చెరువులను అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం కొంత మోనికుంటా, డ్రీమ్‌సిటీలో పర్యటించారు.  ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్ని చెరువులు నిండాయన్నారు. చెరువుల్లో చేపలు వేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌ వేసి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి  పాల్గొన్నారు.  

logo