బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 15, 2020 , 23:49:39

‘ముంపు సమస్యను పరిష్కరిస్తాం’

‘ముంపు సమస్యను పరిష్కరిస్తాం’

 బడంగ్‌పేట : మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో ట్రంక్‌లైన్‌ పనులు త్వరలో పూర్తిచేసి ముంపు సమస్యను  పరిష్కరిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.  శనివారం కార్పొరేషన్‌ పరిధిలోని ఎంఎల్‌ఆర్‌ కాలనీ, మిథిలానగర్‌లో పర్యటించారు. ఇండ్లలోకి వరద నీరు వచ్చిన వారితో మట్లాడారు. అనంతరం  అధికారులు, కాలనీ వాసులతో  మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.23 కోట్లతో  ట్రంక్‌ లైన్‌  పనులు కొనసాగుతున్నాయన్నారు.  వరద నీరు పోవడానికి మురుగు నీటి కాల్వలను క్లీన్‌ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. హెచ్‌ఎండీఏ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి  ట్రంక్‌ లైన్‌కు తాత్కాలికంగా కనెక్షన్‌ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కమిషనర్‌ సుమన్‌ రావు, కార్పొరేటర్లు  తదితరులు పాల్గొన్నారు.