బుధవారం 30 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 05, 2020 , 00:21:53

సొసైటీలు పారదర్శకంగా పనిచేయాలి

సొసైటీలు  పారదర్శకంగా పనిచేయాలి

సహకార సంఘాలను బలోపేతం చేస్తాం

మంత్రి సబితాఇంద్రారెడ్డి 

రైతులకు రూ. 35లక్షల చెక్కులు పంపిణీ 

బడంగ్‌పేట : సహకార  సంఘాలను బలోపేతం చేస్తామని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని  భాగ్యనగర్‌ రైతు సేవాసంఘంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. రైతులకు, వ్యాపారులకు  రూ.35లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం హరిత హారంలో పాల్గొని మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొసైటీలు  పారదర్శకంగా పనిచేయాలన్నారు. డీసీసీబీ ద్వారా రూ. 240కోట్ల రుణాలను రైతులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రైతు గోదాములు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. డీసీసీబీ ఆధ్వర్యంలో 5 లక్షల 34వేల 8 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.125 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. డీసీసీబీ ద్వారా రైతుల తోపాటు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందడానికి వీలు ఉంటుందన్నారు.    సహకార సంఘాలు   డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించాలని మహిళలకు రుణాలు ఇవ్వాలన్నారు.  రైతులకు ట్రాక్టర్లు కావలసిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోతానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మనోహర్‌రెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి,  భాగ్యనగర్‌ సహకార సంఘం చైర్మన్‌ మర్రి నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బంగారు బాబు పాల్గొన్నారు.  

రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి

మహేశ్వరం: రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రఘుమారెడ్డి సూచించారు. మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. ఎంపీడీవో నర్సింహులు, పార్టీ మండలాధ్యక్షుడు హనుమగండ్ల చంద్రయ్య, సిరిగిరిపురం సర్పంచ్‌  సురేశ్‌, కాంట్రాక్టర్‌ మెహతా తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

బడంగ్‌పేట:  టీఆర్‌ఎస్‌ నాయకుడు యంగల యాదగిరి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా జిల్లెలగూడ 41వ వార్డు కార్పొరేటర్‌ రాజేందర్‌ రెడ్డి  మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా రూ.50వేలు అందజేశారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరుందన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు సహకారం అందిస్తామన్నారు.  కార్పొరేటర్‌ బొక్క రాజేందర్‌రెడ్డి ఆర్థిక సహాయం చేయడంపై మంత్రి అభినందించారు.  మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, కార్పొరేటర్‌ సిద్దాల లావణ్య బీరప్ప తదితరులు పాల్గొన్నారు.  

బడంగ్‌పేట :  హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని 19వ వార్డులో మొక్కలు  నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు.  మేయర్‌ దీప్‌లాల్‌ చౌహన్‌, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షురాలు, కార్పొరేటర్‌ సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్‌ బొక్క రాజేందర్‌రెడ్డి, బాలమణి, కమిషనర్‌ కృష్ణ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo