మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 00:17:17

పూడికతోనే ముంపు సమస్య

పూడికతోనే ముంపు సమస్య

   ప్రేమ్‌నగర్‌ బీ బ్లాక్‌లో కొద్దిపాటి వర్షానికే ఇండ్లలోకి నీరు

   ప్రాంతాల్లోకి చేరుతున్న వరద నీరు

   పట్టించుకోవాలంటున్న స్థానికులు

  కొండాపూర్‌ : ఓపెన్‌ నాలా పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోవడంతో కొద్దిపాటి వర్షానికి వరద నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరుతున్నది. కొన్ని నెలల క్రితం పూడికతీత పనులను ప్రారంభించినప్పటికీ అది సగంలోనే వదిలేయడంతో సమస్య మొదటికొచ్చింది. శేరిలింగంపల్లి సర్కిల్‌-20 పరిధిలోని కొండాపూర్‌ డివిజన్‌ ప్రేమ్‌నగర్‌ బీ బ్లాక్‌ కాలనీలో ఉన్న నాలా పూర్తిగా పూడికతో మూసుకుపోవడంతో కొద్ది పాటి వర్షం కురిస్తే వరద నీరంతా కాలనీ రోడ్లు, లోతట్టులోని ఇండ్లలోకి చేరుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని ముంపు సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు అధికారులను కోరుతున్నారు. నాలాను శుభ్రం చేసి వరద నీరు వెళ్లేలా చేస్తే సమస్య తీరుతుందని నాయకులు తెలిపారు. 


సమస్య పరిష్కారానికి చర్యలు

ముంపునకు గురయ్యే అన్ని ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రేమ్‌నగర్‌ బీ బ్లాక్‌లోని లోతట్టు ప్రాంతంలో ఓపెన్‌ నాలా పూడిక తీత పనులను వెంటనే ప్రారంభించేలా సంబంధిత శాఖ అధికారులతో చర్చిస్తాం. ప్రజలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిష్కరించి, సమస్య పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకుంటాం. 

 -హమీద్‌ పటేల్‌, కొండాపూర్‌ కార్పొరేటర్‌