గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 23:54:29

శంషాబాద్‌ను అభివృద్ధి చేస్తా

శంషాబాద్‌ను అభివృద్ధి చేస్తా

అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

శంషాబాద్‌, ఆగస్టు 24:  శంషాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు.  మండలంలోని  మల్కారంలో  రూ. 40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్‌ కొత్త మాధవి యాదగిరి రెడ్డితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 26న మంత్రి కేటీఆర్‌ చందన్‌వెళ్లిలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌, టెక్స్‌టైల్‌ ప్రారంభించిన అనంతరం ప్రధాన కంపెనీలు పెట్టుబడులతో  శంషాబాద్‌, షాబాద్‌ వైపు చూస్తున్నాయన్నారు. 3,600 ఎకరాల్లో చందన్‌వెళ్లి ఇండస్ట్రియల్‌ రానున్నట్లు తెలిపారు.  శంషాబాద్‌- నాదర్‌గూడ వరకు 30 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ నాలుగులేన్ల రోడ్డును  పూర్తి చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.  అది పూర్తయితే భూముల ధరలు పెరుగనున్నాయన్నారు. శంషాబాద్‌- హైతాబాద్‌, చందన్‌వెల్లి, షాబాద్‌ ప్రాంతాల్లో  ఏర్పడే కంపెనీలతో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. 

టీఎన్జీవో కాలనీ పార్కును తీర్చిదిద్దాలి

బండ్లగూడ:  టీఎన్జీవో కాలనీ పార్కును  తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అధికారులను  ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పార్కును  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో వాకింగ్‌ ట్రాక్‌తో పాటు పెద్దలు సేద తీరడానికి బెంచీలు, చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయలన్నారు. కార్యక్రమంలో ఈఈ నరేందర్‌గౌడ్‌, డీఈ సంగప్ప, ప్రేమ్‌గౌడ్‌  పాల్గొన్నారు. 


త్వరలో సీఎం కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్‌ శంషాబాద్‌లో త్వరలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. శంషాబాద్‌ హుడా కాలనీ పరిధిలో నూతనంగా  నిర్మించిన టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ప్రారంభానికి రానున్నందున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.  సరిపడా నిధులు సీఎంను అడిగి  ప్రతి పంచాయతీకి రూ.50 లక్షలు కేటయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వి, సొసైటీ చైర్మన్‌ సతీశ్‌, ఎంపీటీసీ క్రాంతి కుమార్‌,  పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు, యాదగిరిరెడ్డి, మోహన్‌రావు, సర్పంచ్‌లు ఇస్తారి, రమేశ్‌, రాజశేఖర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.