మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 00:16:00

అభివృద్ధిలో శంషాబాద్‌ మున్సిపల్‌ ఆదర్శం

అభివృద్ధిలో శంషాబాద్‌ మున్సిపల్‌ ఆదర్శం

శంషాబాద్‌, ఆగస్టు 10: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో శంషాబాద్‌ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం ఆర్‌బీ నగర్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం  శంషాబాద్‌ హుడాకాలనీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.


logo