గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 00:09:28

తెరుచుకున్న బడులు

తెరుచుకున్న బడులు

ఆన్‌లైన్‌ క్లాస్‌లకు కసరత్తు 

విద్యార్థుల వివరాలు తెలుసుకుంటున్న ఉపాధ్యాయులు

నియోజకవర్గంలో 194 పాఠశాలలు,  33 వేల మంది విద్యార్థులు

బడంగ్‌పేట, ఆగస్టు 27:  మహేశ్వరం నియోజకవర్గంలోని   ప్రభుత్వ పాఠశాలలకు అందరూ ఉపాధ్యాయులు హాజరయ్యారని ఎంఈవో కృష్ణయ్య తెలిపారు. సెప్టెంబర్‌ 1న ప్రారంభం కానున్న ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం జూమ్‌యాప్‌  ద్వారా గురువారం సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు.  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉపాధ్యాయులకు వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని విద్యార్థుల జాబితాపై ఉపాధ్యాయులు సర్వే మొదలు పెట్టినట్లు వెల్లడించారు. డిజిటల్‌ సదుపాయం లేని విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కసరత్తు చేస్తున్నారన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా  194 ప్రభుత్వ పాఠశాలలు, 33వేల మంది విద్యార్థులు,1500 మంది ఉపాధ్యాయులున్నట్లు తెలిపారు.   విద్యార్థులకు ఫోన్లు చేసి డిజిటల్‌ క్లాస్‌లు వినడానికి టీవీ, ఫోన్‌ ఉన్నాయా లేదా అన్న అంశాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. లేని వారు పక్కవారి సహకారం తీసుకోవాలని,  పంచాయతీ, మున్సిపల్‌ వార్డు కార్యాలయాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.  మూడు రోజుల్లో విద్యార్థుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. 

తుక్కుగూడలో..

విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు బోధించేందుకు  ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, కౌన్సిలర్లు తేజస్వినీ శ్రీకాంత్‌ గౌడ్‌ ,సప్పిడి లావణ్య రాజు , రవినాయక్‌ ,రెడ్డిగళ్ల సుమన్‌ పాఠశాలలను పరిశీలించారు.