శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jun 23, 2020 , 00:10:38

గ్రామాల అభివృద్ధికి రూ.309 కోట్లు

గ్రామాల అభివృద్ధికి రూ.309 కోట్లు

పల్లె ప్రగతితో  మారుతున్న రూపురేఖలు

మంత్రి సబితాఇంద్రారెడ్డి

నూతన ట్రాక్టర్లు ప్రారంభం

కందుకూరు:  గ్రామాల అభివృద్ధికి  ప్రభుత్వం  ప్రతి ఏ టా రూ. 309 కోట్లు కేటాయిస్తుందని మంత్రి సబితా ఇం ద్రారెడ్డి  తెలిపారు.  సోమవారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సరస్వతీగూడ, కటికపల్లి, జబ్బారుగూడ, కొలనుగూడ,మీర్‌ఖాన్‌పేట్‌, బేగరికంచె గ్రామాలకు మం జూరైన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు.  చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందు కు ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిపారు.  కార్యక్రమంలో డీఎల్‌పీవో శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్‌ చైర్మన్‌ సురసాని వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, వైఎస్‌ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణకుమారి, తహసీల్దార్‌ జ్యోతి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్‌, వైఎస్‌ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు రాము, నరేందర్‌గౌడ్‌, గీతేశ్వరి, జ్యోతి, గోవర్ధన్‌, భూపాల్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.

పేదలను ఆదుకోవాలి

బడంగ్‌పేట: పేదలను ఆదుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేషన్‌ పరిధిలోని పెద్దబావి గార్డెన్‌లో యంగిస్తాన్‌ సంస్థ సభ్యులు అరుణ్‌ డానియల్‌, రిత్విక ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు మంత్రి నిత్యావసర సరుకులను  అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  యంగిస్తాన్‌ సంస్థ  పేద బ్రాహ్మణులను గుర్తించి సరుకులను అందజేయడం అభినందనీయమన్నారు.   కార్యక్రమంలో మేయర్‌ చిగిరింత పారిజాత న ర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్‌, రమేశ్‌, ముద్ద పవన్‌, రామిడి కవితా రాంరెడ్డి, సంరెడ్డి స్వప్నావెంకట్‌రెడ్డి, భీమిడి స్వప్నాజంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి, ఏనుగు రాం రెడ్డి, శోభా ఆనంద్‌రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, రమేశ్‌  తదితరులు పాల్గొన్నారు. 

వర్షపు నీరు తొలగించాలి

 వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొల గించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ, బాలాజీ నగర్‌, శ్రీధర్‌ కాలనీల్లో ఆమె పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రంక్‌ లైన్‌ పనులు పూర్తయితే ముంపు సమస్య తీరుతుందన్నారు.  సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని సూ చించారు. 

ముంపు సమస్యను పరిష్కరిస్తాం..

జిల్లెలగూడ ముంపు సమస్య పరిష్కారానికి రూ.7.90 కోట్లు కేటాయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లెలగూడ పరిధిలోని 17,38,39,40,41,42,43,44 వార్డుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 2 కోట్లు కేటాయించామన్నారు. వంగ శంకరమ్మ గార్డెనర్‌ నుంచి శ్రీనగర్‌ కా లనీ, గాయత్రీ నగర్‌ వరకు బాక్స్‌ డ్రైన్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ సిద్దాల లావణ్య బీరప్ప, కమిషనర్‌ సుమన్‌ రావు, మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారి పద్మజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థికి అభినందనలు

శంషాబాద్‌:  ఇంటర్‌ మొదటి సంవత్సరంలో స్టేట్‌ 7 వ ర్యాంక్‌ సాధించిన గచ్చిబౌలి మోడల్‌ కళాశాల విద్యార్థిని చందనను మంత్రి సబితారెడ్డి అభినందించారు.  రాళ్ల గూడకు చెందిన గొరిగె చందన ఫస్టియర్‌ ఎంఈసీలో 500 గాను 488 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదవాలని సూచించారు.