గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 04, 2020 , 00:51:14

ప్రైవేట్‌ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని వినతి

 ప్రైవేట్‌ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని వినతి

ఉప్పల్‌  : తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ షబ్బీర్‌ ఆలీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈ మేరకు ప్రవేట్‌ టీచర్ల సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్‌ టీచర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చించేవిధంగా చూడాలన్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్నవారికి వేతనాలు అందేలా చూడాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తొలగించిన ప్రైవేట్‌ టీచర్లను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ప్రైవేట్‌ టీచర్లకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు.  పలువురు ప్రైవేట్‌ టీచర్లు పాల్గొన్నారు.