మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 23:45:28

మంత్రిని కలిసిన ఆల్‌ ఇండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

మంత్రిని కలిసిన ఆల్‌ ఇండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

అడ్డగుట్ట : తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆల్‌ ఇండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను ప్రభుత్వం నివారించాలని, అంతేకాకుండా ట్యూషన్‌ ఫీజుల విషయంలో పాఠశాలల వారీగా ఖచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి అవి తుచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని వారు కోరారు. 2020-21 సంవత్సరాన్ని జీరో సంవత్సరంగా ప్రకటించి వచ్చే విద్యా సంవత్సరంలో రెండు సంవత్సరాల సిలబస్‌ను ప్రకటించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్‌ ప్రతినిధులు భాగ్య, ప్రవీణ్‌కుమార్‌, జ్యోతి, బ్రహ్మాంలు పాల్గొన్నారు.