సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 23:24:11

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య

ఉప్పల్‌: అప్పుల బాధతో మనస్తాపం చెందిన కరీంనగర్‌కు చెందిన ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి... నగరానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. నాచారం సీఐ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కట్టరామాపూర్‌ ప్రాంతానికి చెందిన నాగమల్ల వెంకటనర్సయ్య(51) రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. రియల్‌ఎస్టేట్‌లో డబ్బులు పెట్టి నష్టపోయి... అప్పులు తీర్చలేక గురువారం కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. నాచారంలోని ద్వారకాలాడ్జిలో రూం తీసుకున్నాడు. గదిలో తనతోపాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి  ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి సిబ్బంది డోర్‌ కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి డోరు తెరిచారు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య ఉమారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.