తలకొండపల్లి : తలకొండపల్లి మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నియమించారు. మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికవడంతో ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో టీఆర్ఎస్ని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిచాలని సూచించారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నుల్ జడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్‌తో పాటు మండల టీఆర్ఎస్ నాయకులకు చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.