e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home రంగారెడ్డి పేద కుటుంబాలకు సర్కార్‌ భరోసా

పేద కుటుంబాలకు సర్కార్‌ భరోసా

పేద కుటుంబాలకు సర్కార్‌ భరోసా

చేవెళ్లటౌన్‌, జూన్‌24: పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ అండగా ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు.గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 24 మందికి లబ్ధిదారులకు రూ. 9,23,500 విలువ గల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎంపీపీ విజయలక్ష్మి , జడ్పీటీసీ మాలతితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫం డ్‌ పేదలకు వరం లాంటిదన్నారు.బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, పార్టీ మం డల అధ్యక్షుడు ప్రభాకర్‌, తాసీల్దార్‌ అశోక్‌ కుమార్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, నాయకులు కుంచం శివకుమార్‌, నాగర్జునరెడ్డి, రాములు, అధికారులు పాల్గొన్నారు.

మండల పరిధిలోని రాయ పోల్‌ గ్రామానికి చెందిన రాసూరి నర్సింహకు రూ.60వేలు, రాసూరి మనెమ్మ రూ.20వేలు, జంగమ్మకు రూ.30వేలు, హారికకు రూ.29వేలు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరు అయ్యాయి. చెక్కులను గురువారం గ్రామంలో ఎంపీటీసీ అచ్చన శ్రీశైలం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ అచ్చన బాలరాజు, గ్రామస్తులు యాదయ్య, లక్ష్మారెడ్డి, యాదగిరి రెడ్డి, జంగారెడ్డి, యాదయ్య, బాలు గౌడ్‌, నర్సింహ, అశోక్‌, సురేందర్‌, యాదగిరి, కృష్ణ, శంకర్‌ తదితరులున్నారు
మంచాల జూన్‌24: మంచాల మండలం ఆంబోతుతండా గ్రామానికి చెందిన రవీందర్‌ నాయక్‌, సత్యం తండాకు చెందిన నేనావత్‌ గణేష్‌కు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను జడ్పీటీసీ నిత్య నిరంజన్‌రెడ్డి గురువారం వారికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమావత్‌ రాందాస్‌, బాలు నాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేద కుటుంబాలకు సర్కార్‌ భరోసా
పేద కుటుంబాలకు సర్కార్‌ భరోసా
పేద కుటుంబాలకు సర్కార్‌ భరోసా

ట్రెండింగ్‌

Advertisement