కొడంగల్, జూలై 21 : త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని నియోజకవర్గ ముస్లింలకు పండుగ శుభాక్షాంక్షలు తెలిపారు. ముస్లింలు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌కు సన్మానించారు. కార్యక్రమంలో నవాజోద్దీన్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్‌బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్ పట్టణంలో..
వికారాబాద్, జూలై 21 : వికారాబాద్ పట్టణంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జిల్లా ఎస్పీ నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్కుమార్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గౌరారం, దుద్యాల గ్రామాల్లో
బొంరాస్‌పేట, జూలై 21 : మండల పరిధిలోని గౌరారం, దుద్యాల గ్రామాల్లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పర్యటించి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బంట్వారం మండలంలో
బంట్వారం, జూలై 21 : మండల కేంద్రంతో పాటు బొపునారం, తొరుమామిడి, రొంపల్లి తదితర గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల మసీద్‌ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మర్పల్లి మండల కేంద్రంలో..
మర్పల్లి, జూలై 21 : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఫసీయుద్ధీన్, మర్పల్లి టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గఫార్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, గౌస్, ఖాజా ఉన్నారు.
మోమిన్‌పేటలో..
మోమిన్‌పేట, జూలై 21 : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దౌల్తాబాద్, జూలై 21 : మండలంలోని చంద్రకల్, ఈర్లపల్లి, దేవర్‌ఫస్లవాద్, సుల్తాన్పూర్, గోకఫస్లవాద్, బాలంపేట, దౌల్తాబాద్, కుదురుమళ్ల, నందారం, కౌడిడ్, నీటూర్, మాటూర్, కుప్పగిరి, నాగసార్ గ్రామాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు.
త్యాగానికి ప్రతీక..
ధారూరు, జూలై 21 : త్యాగం, స్నేహం, పవిత్రత, దయాగుణానికి ప్రతీక బక్రీద్ అని ఎంఐఎం పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు మోహిజ్ ఖురేషి అన్నారు. ధారూరు మండల కేంద్రంతో పాటు, దోర్నాల్, మోమిన్‌కలాన్, రాజాపూర్, కుక్కింద, నాగసముందర్, నాగారం, తరిగొప్పుల, గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయన వెంట కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, నాయకులు యూనుస్, హశం అలీ, హఫీజ్, మత పెద్దలు, ముస్లింలు ఉన్నారు.