e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు తెలంగాణ అంటేనే టీఆర్‌ఎస్‌

తెలంగాణ అంటేనే టీఆర్‌ఎస్‌

  • రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక తీవ్ర నిరాశలో ప్రతిపక్షాలు
  • సంక్షేమ పథకాలను అడ్డుకునే యత్నాలు
  • సీఎం కేసీఆర్‌కు అండగా ఉందాం
  • ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ వాణీదేవి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్‌ 20 : రాష్ట్రంలో విపక్షాల నాయకులు తీవ్ర నిరా శలో ఉన్నారని, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయ పరి స్థితి ఉందని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టు కోలే క ప్రతిపక్ష పార్టీల నాయకులు ముఖ్యమంత్రిపైన, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల పైన అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆ వాఖ్యలు వారి వివేకానికే వదిలి పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే టీఆర్‌ఎస్‌పార్టీ అని, తెలంగాణలో మరొపార్టీ జెండా ఎగురడానికి వీలులేదన్నారు. తెలంగాణ యావత్తు ప్రజ లు సీఎం కేసీఆర్‌నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దళితులు, మైనా ర్టీలు, బీసీలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకా లను ప్రభుత్వం తీసుకువస్తుండగా, ప్రతిపక్షాలు వాటికి మోకాళ్లడ్డుతు న్నా యని దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో బలంగా ఉం దని, మరింత బలోపేతం చేసుకోవడం కోసం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని, అందుకు మనమంతా అండగా నిలువాలన్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ, వార్డు, మండల, మున్సిపల్‌స్థాయి నాయకులు పార్టీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

పదవులు అలంకారప్రాయం కాదు: ఎమ్మెల్యే మంచిరెడ్డి

- Advertisement -

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు అలంకార ప్రా యం కాకుండా పార్టీ పటిష్టతకు ఉపయోగించాలన్నారు. గ్రామ, వార్డు కమిటీల ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముందుగా పూర్తిచేసి జిల్లాలోనే అగ్రస్తానంలో నిలిచిందన్నారు. రాష్ట్రనాయకులు క్యామ మల్లేశ్‌, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డిలు మాట్లాడుతూ పార్టీకోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు సరైన గౌరవం దక్కుతుందన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మున్సిపల్‌ వార్డుల అధ్యక్ష, కార్యదర్శులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు కృపేష్‌, జాటోతు నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, సహకారసంఘం ఛైర్మన్లు బిట్ల వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పుల్లారెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రైతు సమన్వయసమితి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, నాయకులు నోముల కృష్ణగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, చీరాల రమేశ్‌, కొత్తకుర్మ సత్తయ్య, గోపాల్‌, బాషతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement