e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home రంగారెడ్డి ఊరూరా రైతుల సంబురాలు

ఊరూరా రైతుల సంబురాలు

ఆమనగల్లు,జూన్‌ 15 : రాష్ట్రంలో రైతులంతా ఆత్మగౌరవంతో ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం వానకాలానికి రైతుబంధు డబ్బులు వేయడంతో ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. రాం నుంతల రైతువేదిక ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రైతుబంధు సమితి నాయకులు, పలువురు రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యేటా రెండు దఫాలుగా రైతులకు పెట్టుబడికి సాయం అందజేస్తు న్నట్లు చెప్పారు. కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చే యాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నార న్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అర్జున్‌రావు, సింగిల్‌విండో చైర్మన్‌ గంపవెంకటేశ్‌, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నిట్టనారా యణ, సర్పంచ్‌ సోనా, ఎంపీటీసీ సరిత, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయ కుడు తోటగిరి, శ్రీనునాయక్‌, పంతునాయక్‌, ఖలీల్‌, అప్పంశ్రీను, రమేశ్‌నాయక్‌ పాల్గొన్నారు.

రైతుల సంబురాలు..
మాడ్గుల జూన్‌ 15: మండలంలో రైతులు సంబురాలు చేసుకు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానకాలం సీజన్‌ దృష్టిలో పెట్టుకుని పంట పెట్టుబడికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో కృతజ్ఞతగా రైతులు సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంతో పాటు ఇర్విన్‌, కొలుకులపల్లి, నాగిళ్ల, ఆవు రుపల్లి, కలకొండ, గిరికొత్తపల్లి, అందుగుల, రామదు గ్యాల, అప్పారెడ్డిపల్లి, దొడ్లపహడ్‌, బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతుబం ధు సమితి, సింగిల్‌విండో నాయకులు, సర్పంచులు, ఎంపీటీ సీలు పాల్గొన్నారు. సీఎం చిత్రపాటానికి క్షీరాభిషేకం చేశారు.

- Advertisement -

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కడ్తాల్‌, జూన్‌ 15 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నారని, రైతును రాజుగా చేయడమే ప్రభుత్వం ధ్యేయమని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు పరమేశ్‌, మండల కోఆర్డినేటర్‌ వీరయ్య అన్నారు. వానకాలం పంట పెట్టుబడికి డబ్బులు విడుదల చేయడంతో మంగళవారం మండల కేంద్రంతో పాటు రావిచేడ్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రప టానికి టీఆర్‌ఎస్‌ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సంద ర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ రైతు పక్షపతి అని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సిం హారెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌, ఉప సర్పంచ్‌లు రామ కృష్ణ, వినోద్‌, ముత్యాలు, టీఆర్‌ఎస్‌ కడ్తాల్‌, రావిచేడ్‌ గ్రామాల అధ్యక్షులు జహంగీర్‌అలీ, జితేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు యాదగిరిరెడ్డి, గంప శ్రీను, లక్పతినాయక్‌, లాయక్‌అలీ, శ్రీశై లంయాదవ్‌, సాయికుమార్‌, రమేశ్‌, లింగం, ఇర్షాద్‌, మహేశ్‌, అంజి, టీకులాల్‌ పాల్గొన్నారు.

కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం
యాచారం, జూన్‌15 : సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్య మవుతుందని పీఏసీఎస్‌ చైర్మన్‌ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జోగిరెడ్డి అన్నారు. పెట్టుబడి సాయం డబ్బులు జమచేసిన సందర్భంగా మండల కేంద్రం లోని రైతువేదిక భవనం వద్ద రైతులు సీఎం కేసీఆర్‌ చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ చైర్మన్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు వరప్రసాద్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

రైతును రాజును చేయడమే లక్ష్యం
అబ్దుల్లాపూర్‌మెట్‌, జూన్‌15: రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రైతుబంధు సమితి జిల్లా చైర్మన్‌ లక్ష్మారెడ్డి అన్నారు. వానకాలానికి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయాలని ప్రభుత్వం అదేశించడంతో మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి లక్ష్మా రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పారదర్శకంగా రైతుబంధు సాయం రైతు ఖాతాలో జమవుతుందన్నారు. ప్రభు త్వ పథకాలతో రైతులు అప్పులు చేసే బాధ తప్పింద న్నారు. కార్యక్రమంలో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌ విఠల్‌రెడ్డి, వార్డుసభ్యుడు జీవన్‌రెడ్డి, నాయకులు చెరుకు రఘుగౌడ్‌, లెక్కల నితిన్‌రెడ్డి, నాగమల్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రైతు ప్రయోజనాలకు పెద్దపీట
ఇబ్రహీంపట్నంరూరల్‌, జూన్‌ 15 : రైతాంగ ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ కృపేశ్‌ అన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సాయాన్ని అందజేయడంతో కృతజ్ఞతగా మంగళవారం సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, జిల్లా ఉత్తమ రైతు మొద్దు అంజిరెడ్డిలతో కలిసి ఉప్పరిగూడ రైతువేదికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రైతులు పంటల పెట్టుబడికి బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అనేక ఇబ్బందులు పడేవారన్నారు. దాన్ని నుంచి విముక్తి కలిగించడానికి సీఎం కేసీఆర్‌ రైతుబంధు అందిస్తున్నారన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana