e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home రంగారెడ్డి ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం

కులకచర్ల, జూలై 13: కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తి దారుల సంస్థ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు డీఆర్డీఏ-సెర్ప్‌ అడిషనల్‌ డీఆర్డీవో కె.నర్సింహులు తెలిపారు మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని ఎం పీపీ సత్యమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీఆర్డీవో నర్సిం హులు మాట్లాడుతూ రైతులు నేరుగా వచ్చి విత్తనాలు, ఎరువులు తీసుకో వాలని సూచించారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఉండేందుకు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. విక్రయ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేవిదంగా సెర్ప్‌ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఎంపీపీ సత్యమ్మ మాట్లాడుతూ మండలంలో 2035 మంది సభ్యులు మహిళా రైతు సంఘాల్లో చేరడం అభినందనీయమన్నారు. రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాలకు మహిళా రైతులకు కూడా ఆహ్వా నించాలని, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కులకచర్ల గ్రామ సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, ఎంపీటీసీ ఆనందం, డీపీఎం శ్రీని వాస్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, మండల వ్యవసా యాధికారి వీరస్వామి, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, శ్రీరామ లింగేశ్వర ఎఫ్‌పీవో డైరెక్టర్లు, సెర్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందాలి
మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులు, సెర్ప్‌ ద్వారా రుణాలు తీసుకొని ఆర్థికంగా ఎదగాలని కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని భవిత సం ఘంలోని భవిత సంఘంలోని భూదేవి అనేమహిళ సెర్ప్‌ ద్వారా లక్ష రూ పాయలు తీసుకొని హోంనీడ్‌ షాపును పెట్టగా ఎంపీపీ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు సెర్ప్‌ ద్వారా రుణా లు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రభుత్వం మహి ళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించేందుకు చర్య లు తీసు కుం టున్నదని, మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా, సెర్ప్‌ ద్వారా రుణాలు తీసుకోవాలన్నారు. తీసుకున్న రుణాలను ఆదాయాభివృద్ధికి కార్య క్రమాలకు ఉపయోగించుకోవాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement