e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home రంగారెడ్డి ఎడతెరిపిలేకుండా..

ఎడతెరిపిలేకుండా..

ఎడతెరిపిలేకుండా..
  • అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్‌, కొత్తూరు, నందిగామ,ఫరూఖ్‌నగర్‌ మండలాల్లో కురిసిన వాన
  • మొయినాబాద్‌ మండలంలో ప్రవహిస్తున్న ఈసీ వాగు

రంగారెడ్డి, జూలై 13, (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. రెండు రోజులుగా జిల్లా అంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మొయినాబాద్‌ మండలంలో ఈసీ వాగు ప్రవహిస్తుండడంతోపాటు పలు మండలాల్లోని వాగులు పారాయి. ముఖ్యంగా జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌, నందిగామ, ఫరూఖ్‌నగర్‌, కొత్తూరు మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలతో పంటలకు మేలు జరిగింది. విత్తనాలను నాటిన అనంతరం పదిహేను రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులు ప్రస్తుత వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ నెలాఖరు వరకు 153 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 104 మి.మీ నమోదైంది. జిల్లాలోని 17 మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకాగా, మరో 9 మండలాల్లో సాధారణ, ఒక మండలంలో తక్కువ వర్షపాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధిక వర్షపాతం
జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో 56 మి.మీ వర్షపాతం నమోదుకాగా, బాలాపూర్‌లో 48.9, హయత్‌నగర్‌ 44.6, శంషాబాద్‌ 55.8, కొత్తూరు, నందిగామ 43.6, ఫరూఖ్‌నగర్‌ 46.5, చౌదరిగూడ 28.3, కొందుర్గు 23.8, షాబాద్‌ 23.7, చేవెళ్ల 23.7, మొయినాబాద్‌ 22.7, మహేశ్వరం 25.2, కందుకూరు 6.8, కడ్తాల్‌ 6.2, కేశంపేట 12.9, తలకొండపల్లి 21.7, ఆమనగల్లు 7.7, యాచారం 2.1, మంచాల 3.1, ఇబ్రహీంపట్నం 8.1, సరూర్‌నగర్‌ 27.3, రాజేంద్రనగర్‌ 29.2, గండిపేట 24, శేరిలింగంపల్లి 20.6, శంకర్‌పల్లి మండలంలో 30.7 మి.మీ వర్షపాతం నమోదైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎడతెరిపిలేకుండా..
ఎడతెరిపిలేకుండా..
ఎడతెరిపిలేకుండా..

ట్రెండింగ్‌

Advertisement