e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home రంగారెడ్డి కుదురులేని మనసుకు మాటలతో ఉపశమనం

కుదురులేని మనసుకు మాటలతో ఉపశమనం

కుదురులేని మనసుకు మాటలతో ఉపశమనం
  • కొవిడ్‌ బాధితులకు మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌
  • ఆన్‌లైన్‌, ఫోన్‌, వీడియో సెషన్ల ద్వారా ఉచిత సేవలు

హైదరాబాద్‌, మే 12 (నమస్తే తెలంగాణ): ఏదైనా అనారోగ్యం బారినపడితే ఆందోళన చెందుతాం. తీవ్ర మనోవేదనకు గురవుతాం. అ లాంటిది కొవిడ్‌ సోకి తే ఏమైనా ఉందా! ఎవరికి చెప్పుకోవా లో? ఏం చేయా లో? తెలియని సంకట స్థితి. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా.. ధైర్యంగా పోరాడుదామనుకున్నా పరిస్థితులు కుదురుగా ఉండనివ్వవు. ఎవరి ద్వారా సోకింది? ఎక్కడ పొరపాటు చేశాం? కుటుంబం, ఆర్థిక పరిస్థితు లు, మనపై ఆధారపడిన వారి గురించి ఆలోచనలు వెంటాడుతుంటాయి. ఇవే కాకుండా గొంతులో ఏమైనా ఉందా? ముక్కు బాగా పనిచేస్తుందా? పల్స్‌ సరిగ్గా ఉందా? జ్వరం, వాసనలున్నాయా? అనే పరిశీలనలు సరేసరి. ఇలాంటి దీర్ఘాలోచనలు, ఆందోళనల ఫలితంగా మనసు కుదురుగా ఉండదు. చిత్ర విచిత్ర ప్రవర్తనలు, పిల్లలపై అరుపులు, కేకలు.. మొత్తంగా మెంటల్‌ టెన్షన్‌కు గురవుతుంటారు. ఇలాంటి టెన్షన్‌ను దూరం చేసేందుకు పలువురు మానసిక నిపుణులు కౌన్సెలింగ్‌ను అందిస్తున్నారు. ఆన్‌లైన్‌, ఫోన్‌, వీడియో సెషన్లు నిర్వహిస్తున్నారు. కొందరు ఉచితంగా సేవలందిస్తుండగా, మరికొందరు ఫీజులు తీసుకుంటూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇలాంటి సంస్థలు, వాటి ఫోన్‌ నంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుదురులేని మనసుకు మాటలతో ఉపశమనం

ట్రెండింగ్‌

Advertisement