e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home రంగారెడ్డి రోడ్ల పునరుద్ధరణ పనులు షురూ

రోడ్ల పునరుద్ధరణ పనులు షురూ

రోడ్ల పునరుద్ధరణ పనులు షురూ

ఇబ్రహీంపట్నంరూరల్‌, జూలై 12 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల పునర్నిర్మాణం చేయడంతో పాటు ప్రధాన రోడ్లను కలుపుతూ ఉన్న గ్రామీణ ప్రాంతాల రోడ్లను డబుల్‌రోడ్లుగా విస్తరించడంతో వాహనదా రులకు ప్రయాణం సులువుగా మారింది. ఇబ్రహీంపట్నం నియోజక వర్గం లో గతంలో మెటల్‌రోడ్లుగా ఉన్న రోడ్లన్నీ బీటీరోడ్లుగా మార్చారు. నియో జకవర్గంలో ప్రధాన రోైడ్లెన ఇబ్రహీంపట్నం-తూప్రాన్‌పేట్‌, ఇబ్రహీం పట్నం-ఆరుట్ల, ఆగాపల్లి-శ్రీశైలం ప్రధాన రహదారి, గున్‌గల్‌-లోయపల్లి తో పాటు పలు ప్రధాన రోడ్లను రెండులైన్ల రోడ్లుగా మార్చడంతో ప్రమా దాలు పూర్తిగా తగ్గిపోయాయి. గత వర్షాకాలంలో నియోజకవర్గంలో దెబ్బతిన్నరోడ్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూ.13.45కోట్ల నిధులు మంజూరు చేసింది. నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిలో బొంగుళూరు నుంచి మాల్‌ వరకు రూ.4.25కోట్లు, దండుమైలారం-రాయపోల్‌ రోడ్డు వంతెనల నిర్మాణానికి రూ.2.40కోట్లు, పోచారం-ఎలిమినేడు బీటీరోడ్డు నిర్మాణం కోసం రూ.80లక్షలు, అనాజ్‌పూర్‌-గుంతపల్లి-మజీద్‌పూర్‌ రోడ్డుకు రూ.85లక్షలు మంజూరు అయ్యాయి. అలాగే కుత్బుల్లాపూర్‌-గౌరెల్లి రోడ్డుకు రూ.75లక్షలు, రాయపోల్‌రోడ్డు-చిత్తాపూర్‌, తాళ్లపల్లిగూడ రోడ్డు రూ.30లక్షలు, ఆరుట్ల నుంచి బండాలేమూర్‌ రోడ్డుకు రూ.50లక్షలు, మంచాల నుంచి జాపాల మీదుగా ఆగాపల్లి ప్రధాన రహదారి వరకు రూ.40 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. రంగాపూర్‌ నుంచి వెంకటేశ్వర తం డాకు రూ.20లక్షలు, పోల్కం పల్లి-నెర్రపల్లి మీదుగా దండుమైలారం వరకు గల రోడ్డుకు రూ.85లక్షలు, ఎలిమినేడు నుంచి తులేకలాన్‌వరకు గల రోడ్డుకు రూ.60లక్షలు, యాచారం నుంచి చౌదర్‌పల్లి నుంచి తులేఖుర్దు వరకు గల రోడ్డుకు రూ.85లక్షలు, రాయపోల్‌ ప్రధాన రహదారి నుంచి మన్నెగూడ గ్రామం రోడ్డుకు రూ.28లక్షల నిధులు మంజూరు అయ్యాయి.ఈ రోడ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

అన్ని గ్రామాల రోడ్ల పునరుద్ధరణ
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాలతో పాటు ఇబ్రహీం పట్నం, తుర్కయంజాల్‌, పెద్దఅంబర్‌పేట్‌, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని గ్రామాల రోడ్లను పునరుద్ధరించడంతో పాటు అవసరమైన రోడ్లను విస్తరించేందుకు కృషి చేస్తాం. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం కోసం ఇటీవల మంజూరైన నిధులతో రోడ్ల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యా యి. మెటల్‌రోడ్లుగా ఉన్న వాటిని బీటీరోడ్లుగా మార్చేందుకు కృషిచేస్తున్నాం.

  • మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే -ఇబ్రహీంపట్నం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోడ్ల పునరుద్ధరణ పనులు షురూ
రోడ్ల పునరుద్ధరణ పనులు షురూ
రోడ్ల పునరుద్ధరణ పనులు షురూ

ట్రెండింగ్‌

Advertisement