e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home రంగారెడ్డి ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

యాచారం, మే7: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం ఎంతగానో కృషి చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు ఖాజు మహ్మద్‌ అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన కానుకలను శుక్రవారం ముస్లిం, మైనారిటీలకు పంపిణీ చేశా రు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో మండలంలోని ముస్లింలకు రంజాన్‌ కానుకలు పంపిణీ చేయ డం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో అఫ్సర్‌, జమా ల్‌, అజ్మత్‌, హాజీ, ఖాసీం, కలీం, అబ్దుల్‌ ఖాదర్‌, అశ్వాక్‌ పాల్గొన్నారు.

చేవెళ్లలో..
చేవెళ్ల టౌన్‌, మే7: ప్రజల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మల్కాపూర్‌ ఉప సర్పంచ్‌ సయ్యద్‌ జాఫర్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని మల్కాపూర్‌ లో రంజాన్‌ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

కడ్తాల్‌లో..
కడ్తాల్‌, మే7: మండలంలోని ఆయా గ్రామాల్లో రంజాన్‌ చివరి శుక్రవారాన్ని (జుమాతుల్‌- విదా) పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని మసీద్‌ ఖుబా, ఆర్షద్‌లలో ఇమామ్‌లు మౌలానా జహీరుద్ధీన్‌, మహ్మద్‌ నాయర్‌ల ఆధ్వర్యంలో ఖురాన్‌ పఠనం, ప్రత్యేక నమాజ్‌లు చేశారు. చివరి శుక్రవారం నమాజ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా మసీదు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మసీద్‌ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్వ్రూఫ్‌, అహ్మద్‌జానీ, ఉపాధ్యక్షులు మహ్మద్‌ జావిద్‌, అబ్దుల్‌ వాహబ్‌, మహ్మద్‌ ఇర్షాద్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ట్రెండింగ్‌

Advertisement