e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ షురూ..

ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ షురూ..

ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ షురూ..

ఒక్కొక్కరికి 15 కిలోలు పంపిణీ
రంగారెడ్డి జిల్లాలో 17,44,464 మంది లబ్ధిదారులు
26,937 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని అంచనా

రంగారెడ్డి, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ): రోజు కూలీ చేస్తే నే కుటుంబాన్ని పోషించేందుకు కష్టాలు పడే పేద ప్రజలు కరోనా, లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సడలింపు ఇచ్చినప్పటికీ ఉపాధి లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పేద ప్రజల ఆకలి తీర్చేందుకుగాను తెల్లరేషన్‌కార్డులందరికీ ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో శనివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రి య ప్రారంభమయ్యింది. జిల్లాలోని 313 రేషన్‌ దుకాణాల్లో ఆహార భద్రత లబ్దిదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 919 రేషన్‌ దుకాణాలుండగా, మరో రెండు, మూడు రోజుల్లో మిగతా అన్ని రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యం పంపిణీకి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లావ్యాప్తంగా 5,24,485 రేషన్‌కార్డులుండగా,…17,44,464 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో తెల్లరేషన్‌ కార్డులు 4,89, 294 ఉండగా, 16,52,482 మంది తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులున్నారు. మరోవైపు జిల్లాలో ఆంత్యోదయ కార్డులు 35,149 ఉండగా, లబ్ధిదారులు-91,929, అన్నపూర్ణ కార్డులు 42 ఉండగా, 53 మంది లబ్ధిదారులున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం తెల్లరేషన్‌ కార్డుదారులకు 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తుండగా, ఆంత్యోదయ కార్డు లబ్ధిదారులకు రెగ్యులర్‌గా ఇచ్చే 35 కిలోలతోపాటు మరో 10 కిలోలు, అన్నపూర్ణకార్డు లబ్ధిదారులకు రెగ్యులర్‌గా ఇచ్చే 10 కిలోలతోపాటు అదనంగా పది కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒకేసారి అందరూ రేషన్‌ దుకాణాలకు చేరుకొని గుమిగూడకుండా రోజుకు కొంత మందికి చొప్పున రేషన్‌ బియ్యా న్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకుగాను 26,937 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించగా, ఇప్పటివరకు జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు 10 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయ గా, మరో సుమారు 16 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఒకట్రెండు రోజుల్లో జిల్లాలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

వికారాబాద్‌ జిల్లాలో 8లక్షల మందికి
పరిగి, జూన్‌ 5: వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 8లక్షల మందికి ఉచిత బియ్యం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలో 2,34,700 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 8లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు బియ్యం సరఫరా జరుగగా శనివారం నుంచి పంపిణీ ప్రారంభమైంది. మిగతా గ్రామాల్లో సైతం బియ్యం పంపిణీకి అవసరమైన చర్యలను అధికారులు చేపట్టారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఈనెల జిల్లాకు 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయింపులు జరిగాయి. జిల్లా పరిధిలో 588 రేషన్‌ దుకాణాలు ఉండగా, వాటికి బియ్యం తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి నెలతో పోలిస్తే మూడురెట్లు రేషన్‌ కోటా పెరగడం వల్ల బియ్యం పంపిణీకి అన్ని రకాలుగా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ స్టాక్‌ పాయింట్ల నుంచి బియ్యం ఆయా గ్రామాల్లోని రేషన్‌ దుకాణాలకు తరలిస్తున్నారు. రెండుమూడు రోజులలో పూర్తిస్థాయిలో బియ్యం కోటాను అన్ని రేషన్‌ దుకాణాలకు చేరవేసే విధంగా శరవేగంగా తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ షురూ..

ట్రెండింగ్‌

Advertisement