e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home రంగారెడ్డి వాన కురిసె..రైతు మురిసె

వాన కురిసె..రైతు మురిసె

వాన కురిసె..రైతు మురిసె

చేవెళ్ల రూరల్‌, జూన్‌ 4: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో చేవెళ్ల మండల పరిధిలోని పలు వాగులు ప్రవాహంలా పొంగాయి. ప్రయా ణికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. చేవెళ్ల మండల పరిధి లోని దేవుని ఎర్రవల్లి గ్రామ సమీపంలోని వాగు నదిలా ప్రవహించింది.

చేవెళ్లటౌన్‌, జూన్‌4: చేవెళ్లలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరు పులు,ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చేవెళ్ల మండల పరిధిలోని పామెన గ్రామ సమీపంలో వాగు పొండంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి.

యాచారం, జూన్‌ 4 : మండ లంలో ఓ మోస్తరు వర్షం కు రిసింది. మండలంలోని మే డిపల్లి, మల్కీజ్‌ గూడ, తక్కళ్ల పల్లి, నానక్‌నగర్‌ గ్రామాల్లో వర్షం కురిసింది. రెండు, మూ డు రోజులుగా కురు స్తున్న వర్షాలకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమ గ్నమయ్యారు. జోరుగా పొ లాల్లో దుక్కులు దున్నడం, జొన్నలు, కందు లు విత్తనాలు వేయడం లాం టి పనులు చేపట్టారు. కొంత మంది రైతులు పత్తి విత్త నాలు విత్తేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతులు, కూలీలు బిజీబిజీ అయ్యారు. ఈ సారి కూడా మంచిగా వానలు పడి చెరువులు, కుంటలు నిండి పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతున్నారు.

శంకర్‌పల్లి జూన్‌ 4: శంకర్‌పల్లి పట్టణంలో శుక్రవారం మధ్యాంహ్నం అరగంట పాటు భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు వరదలా పారింది. ఉదయం నుంచి ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలు మధ్యాహ్నం వర్షం పడడంతో సేద తీరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాన కురిసె..రైతు మురిసె

ట్రెండింగ్‌

Advertisement