e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home రంగారెడ్డి ఆలయం చుట్టూ.. అద్భుత శిలలు

ఆలయం చుట్టూ.. అద్భుత శిలలు

ఆలయం చుట్టూ.. అద్భుత శిలలు

పూడూరు , ఏప్రిల్‌ 2 : మండలంలోని కంకల్‌ గ్రామంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయం చుట్టూ పక్కల శిలా సంపదలు దర్శనమిస్తున్నవి. ఈ శిలలు 7వ శతాబ్దానికి చెందినవై ఉండవచ్చని పలువురు మేధావులు, విద్యావంతులు పేర్కొంటున్నారు. పార్షనాథుడు 24వ జైనమత తీర్థ్థంకరుడు కాగా, ఈయన 7వ శతాబ్దానికి చెందినవాడుగా చరిత్ర చెబుతున్నది. మొత్తం 25 మంది తీర్థంకరులలో పార్షనాథుడు 24వ వాడు. కంకల్‌ గ్రామ ప్రాంతంలో ఆనాటి జైనమతం ఉందనడానికి ఇదే నిదర్శనమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతం నుంచే రాష్ట్ర రాజధాని నగరం వైపు ఈసీ వాగు ప్రవహిస్తుంటుంది.

గణపతి కాకతీయుల కాలం..
కంకల్‌ గ్రామం హైదరాబాద్‌ నగరానికి కేవలం 70 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామానికి వెళ్లే ముందు వీరభద్రేశ్వరస్వామి దర్శనంతో పాటు ఆలయ పరిసరాల్లో శిలా సంపద, శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు ప్రాచుర్యం పొందినట్లుగా అర్థమవుతున్నది. చాణుక్యులు, కాకతీయుల కాలంనాటి శాసనాలు ఉండడం విశేషంగా పలువురు భావిస్తున్నారు. కంకల్‌ గ్రామం వీరభద్రేశ్వరస్వామి ఆలయాన్ని సుమారు 500 సంవత్సరాలకు పూర్వం నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠాపన చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ప్రస్తుతం శివాలయాలు, వినాయకుడి ఆలయాలు తూర్పు దిక్కున చూస్తున్నట్లుగా దర్శనమిస్తాయి. ఇక్కడ పూర్వం ప్రతిష్ఠాపించిన శివాలయం, గణపతి ఆలయం మాత్రం వీరభద్రేశ్వరస్వామి ఆలయానికి అభిముఖంగా పడమర దిక్కున చూస్తునట్లుగా ఉండడం విశేషం. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 50 నుంచి 60 వరకు శిలా శాసనాలు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆలయానికి పక్కనే అతితక్కువ లోతు ఉన్న గుండంలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇక్కడున్న శిలా సంపదలను, శాసనాలను మొఘలుల నాటి కాలంలో విగ్రహాలను ధ్వంసం చేసి ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.

పురావస్తు శాఖ అధికారులు ఇక్కడి శిల్పాలను, శాసనాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలి. మండలంలోని ఈ శిలా శాసనాలు మరెక్కడా కనిపించవు. ఆనాటి చరిత్రను నేటి తరానికి వివరించేందుకు చిన్న పాటి మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న వీరభద్రేశ్వరస్వామి ఆలయానికి పలు జిల్లాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది శివరాత్రి ఐదు రోజుల పాటు ఘనంగా జాతర జరుగుతున్నది.

ఇవీ కూడా చదవండి

క‌రోనా మృతుల బీమా క్లెయిమ్స్‌: రూ.1,986 కోట్లు

అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!

అమెరికా ఆంక్ష‌లు: ‌సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీకి డ్రాగ‌న్ ప్రోత్సాహాలు

పేమెంట్ సెటిల్మెంట్ల‌కు క్రిప్టో క‌రెన్సీ: వీసా

రిల‌య‌న్స్ స‌హా టాప్‌-7 ఎం-క్యాప్ రూ.1.07 ల‌క్ష‌ల కోట్లు హ‌రీ

ఇండ్ల‌‌కు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్‌’ ప్రియారిటీ!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆలయం చుట్టూ.. అద్భుత శిలలు

ట్రెండింగ్‌

Advertisement